
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య గత శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీ రూ. 650 కోట్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దీంతో ఈ సినిమా ఫై అన్ని ఇండస్ట్రీల నటి నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ లో రోల్ చేసిన మకరంద్ దేశ్‌పాండే..ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజమౌళి , చరణ్ , ఎన్టీఆర్ లపై ప్రసంశలు కురిపించాడు.
‘నాకు రాజమౌళి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో అక్కడిని వెళ్లాను. అప్పటికే నాకోసం రామ్‌చరణ్, రాజమౌళి ఎదురుచూస్తున్నారు. నేను వెళ్లగానే చరణ్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. బాహుబలితోనే దేశ ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నాడు రాజమౌళి. ఆయన కష్టస్వభావి, ముక్కుసూటి మనిషి. ఎన్నిరోజులనేది నేను చెప్పలేను కానీ నా సినిమాలో మీరుండాలని ఆయన నాతో అన్నాడు. సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు కానీ చాలావరకు నా సన్నివేశాలు కట్ చేశారు. రాజమౌళి ఆలోచనలు పెద్దవి, అందుకోసం ఎంతో కష్టపడ్డాడు కూడా! అనుకున్నట్టుగానే ఆ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ భుజాలపై రామ్‌చరణ్ ఎక్కి ఫైట్ చేసే సన్నివేశం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతుంది. సెట్స్‌లోకి నేను వెళ్లగానే ఎన్టీఆర్ లేచి నిలబడి నన్ను కూర్చోమనేవారు. ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడేవాడు. తారక్ ట్రక్‌లో నుంచి క్రూరమృగాలతో పాటు బ్రిటీష్ సౌధంలోకి దూకే సీన్ అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చాడు.