Homeన్యూస్త్వరలోనే మేజర్ నుండి విడుదల ప్రకటన!!

త్వరలోనే మేజర్ నుండి విడుదల ప్రకటన!!

త్వరలోనే మేజర్ నుండి విడుదల ప్రకటన!!
త్వరలోనే మేజర్ నుండి విడుదల ప్రకటన!!

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మేజర్ షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ తో మేజర్ షూటింగ్ పూర్తి కావొస్తుంది. అడివి శేష్ ఈ షెడ్యూల్ మొదలవ్వగానే ఎమోషనల్ పోస్ట్ చేసాడు. 26/11 అటాక్స్ లో తన ప్రాణాలను పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ షెడ్యూల్ పూర్తయ్యాక తిరిగి మేజర్ సందీప్ కు ఫ్యాన్ గా ఉంటానని అడివి శేష్ తెలిపాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి అడివి శేష్ చాలా కష్టపడాల్సి వచ్చింది. సందీప్ తల్లిదండ్రులను పలుమార్లు కలిసి వారితో మాట్లాడి సినిమా తీయడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. శశి కిరణ్ తిక్కా డైరెక్ట్ చేస్తోన్న మేజర్ ను సోనీ పిక్చర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి.

- Advertisement -

మేజర్ చిత్రంలో సాయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన మేజర్ విడుదల తేదీని ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే ప్రకటిస్తారు. తెలుగుతో హిందీలో కూడా రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని మలయాళంలో డబ్ చేయనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All