
అడివి శేషు , సాయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మేజర్. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషించగా , శ్రీ చరణ్ పాకల సంగీతాన్ని అందిస్తున్నాడు. పాన్ ఇండియా గా ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే చిత్ర తాలూకా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచగా..తాజాగా ఈరోజు చిత్రంలోని ‘జనగణమన’ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
‘జయహే జయహో.. ఎగిరే కలలో.. రగిలే రవివో.. అలిసే బరిలో..’ అంటూ సాగిన ఈ దేశభక్తి గీతం ఉద్వేగభరితంగా ఉంది. సైనికుడిగా ఉండటమంటే ఏమిటి? సోల్జర్ గా అవ్వాలని ఎందుకు అనుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ పాటను రూపొందించారు. ఈ సాంగ్ కు అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు చరణ్. రాజీవ్ భరద్వాజ్ దేశభక్తిని రేకెత్తించే సాహిత్యాన్ని అందించగా.. టోజన్ టోబి ఈ పాటను ఆలపించారు.
‘మేజర్’ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. శేష్ కథ – స్క్రీన్ ప్లే అందించారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ – ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు కలిసి ఈ పాన్ ఇండియా బయోపిక్ ని నిర్మించారు.