Homeటాప్ స్టోరీస్మజిలీ చిత్రాన్ని లీక్ చేసిన తమిళ రాకర్స్

మజిలీ చిత్రాన్ని లీక్ చేసిన తమిళ రాకర్స్

నాగచైతన్యసమంత జంటగా నటించిన మజిలీ చిత్రం ఈనెల 5 న రిలీజ్ కాగా ఆ వెంటనే తమిళ రాకర్స్ మజిలీ పూర్తి చిత్రన్ని లీక్ చేసి షాక్ ఇచ్చారు . మాకు చిన్న చిత్రం , పెద్ద చిత్రం అన్న తేడా లేదని ఏ సినిమా అయినా లీక్ చేయడమే అని మరోసారి చెప్పకనే చెప్పారు . ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమాని ఇలా పైరసి చేస్తుంటే ఏం చేయలేక కుమిలి కుమిలి పోతున్నారు ఆ చిత్ర నిర్మాతలు .

- Advertisement -

ఏప్రిల్ 5న రిలీజ్ అయిన మజిలీ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది . మొదటి రోజునే 7 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించాడు నాగచైతన్య . చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించింది మజిలీ చిత్రం . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత – నాగచైతన్య ల జోడీ కట్టి పడేస్తోంది ప్రేక్షకులను .

నాగచైతన్య పెర్ఫార్మెన్స్ కు పలువురు సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు . చైతూ పై ప్రశంసల వర్షం కురుస్తోంది . అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో ఇలా మజిలీ పైరసి బారిన పట్టడం తో షాక్ అవుతున్నారు ఆ చిత్ర బృందం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All