Homeటాప్ స్టోరీస్మజిలీ పై రివ్యూ ఇచ్చిన హీరో సుశాంత్

మజిలీ పై రివ్యూ ఇచ్చిన హీరో సుశాంత్

అక్కినేని నాగచైతన్య – సమంత జంటగా నటించిన మజిలీ చిత్రాన్ని నిన్న సాయంత్రమే చూసిన హీరో సుశాంత్ మజిలీ చిత్రం అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసాడు . నాగార్జున మేనళ్లుడు హీరో అయిన సుశాంత్ పలు చిత్రాల్లో నటించాడు కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు పాపం . తాజాగా మజిలీ చిత్రం రిలీజ్ అవుతుండటంతో అక్కినేని ఫ్యామిలీ మజిలీ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించింది .

- Advertisement -

కాగా సుశాంత్ కూడా మజిలీ చిత్రాన్ని చూసాడు . ఇంకేముంది నాగచైతన్యసమంత ల నటన గురించి రివ్యూ ఇచ్చేసాడు . నాగచైతన్య – సమంత లు అద్భుతంగా నటించారని అలాగే దర్శకులు శివ నిర్వాణ గురించి అలాగే సంగీత దర్శకులు గోపిసుందర్ గురించి పొగడ్తలతో ముంచెత్తాడు సుశాంత్ . గోపిసుందర్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయని అలాగే తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచిందని తప్పకుండా మజిలీ సూపర్ హిట్ అవుతుందని ట్వీట్ చేసాడు . సుశాంత్ రివ్యూ ఎలా ఉన్నప్పటికీ మరికొద్ది సేపట్లో ప్రేక్షకులు అసలైన తీర్పు ఇవ్వనున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All