Homeటాప్ స్టోరీస్మ‌హేష్ కూడా రిలీజ్ డేట్ చెప్పేశాడు!

మ‌హేష్ కూడా రిలీజ్ డేట్ చెప్పేశాడు!

మ‌హేష్ కూడా రిలీజ్ డేట్ చెప్పేశాడు!
మ‌హేష్ కూడా రిలీజ్ డేట్ చెప్పేశాడు!

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్‌ల జాత‌ర మొద‌లైంది. కేంద్రం ఫిబ్ర‌వ‌రి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో స్టార్ హీరోల చిత్రాల నుంచి అప్ క‌మింగ్ హీరోల చిత్రాల వ‌ర‌కు రిలీజ్ డేట్‌లు ప్ర‌క‌టించేస్తున్నారు. తాజాగా శుక్ర‌వారం సూప‌ర్‌స్టార్ మ‌హేష్ త‌ను న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించేశారు. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నారు.

కీర్తి సురేష్‌ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర బృందం శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌క‌టించింది.  ఈ సంద‌ర్భంగా తాళా గుత్తి ప‌ట్టుకుని క‌నిపిస్తున్న మ‌హేష్ ప్రీలుక్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

- Advertisement -

`సూప‌ర్‌స్టార్ సంక్రాంతి మ‌రోసారి రానుంది. `స‌ర్కారు వారి పాట`‌ను 2022 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తాం` అని ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. `స‌ర్కారు వారి పాట`‌తో మ‌రో సారి సంక్రాంతి బ‌రిలో నిలుస్తుండ‌టం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All