Homeగాసిప్స్మహేష్ అభిమానుల ఎదురుచూపులు మరింత వెనక్కి

మహేష్ అభిమానుల ఎదురుచూపులు మరింత వెనక్కి

మహేష్ అభిమానుల ఎదురుచూపులు మరింత వెనక్కి
మహేష్ అభిమానుల ఎదురుచూపులు మరింత వెనక్కి

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఎప్పుడనేది ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతోంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి పనిచేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు కానీ అది నెరవేరట్లేదు. బాహుబలి తర్వాత నిజానికి రాజమౌళి, మహేష్ తోనే సినిమా చేస్తాడని ఊహించారు. కానీ అటువంటిది ఏం జరగలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాను మొదలుపెట్టాడు రాజమౌళి. ఈ సినిమా 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుని కరోనా ప్రభావం కారణంగా ఆగిపోయింది. ఈలోగా రాజమౌళి అండ్ ఫ్యామిలీకి కరోనా సోకడంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు వారందరూ కరోనా నుండి కోలుకుని రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. లాక్ డౌన్ సమయంలో ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన సినిమా కచ్చితంగా మహేష్ తోనే ఉంటుందని తెలిపారు రాజమౌళి. సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తారు. దీంతో మహేష్ ప్రస్తుతం చేయబోతున్న సర్కారు వారి పాట తర్వాత రాజమౌళితోనే సినిమా అని మహేష్ అభిమానులు ఆనందించారు.

- Advertisement -

అయితే ఇప్పుడా అవకాశాలు కనిపించట్లేదు. ఆర్ ఆర్ ఆర్ విడుదల కావడానికి మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశముంది. దీంతో మహేష్ సర్కారు వారి పాట తర్వాత మరో సినిమా చేయడం కచ్చితంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి మహేష్ – రాజమౌళిల కాంబినేషన్ లో సినిమా 2022కు షిఫ్ట్ అయిందని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All