Homeటాప్ స్టోరీస్మహర్షి 'బెస్ట్ పాపులర్ ఫిల్మ్'.. 67వ జాతీయ అవార్డుల్లో మహర్షి..!

మహర్షి ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్’.. 67వ జాతీయ అవార్డుల్లో మహర్షి..!

Mahesh Maharshi get Best Populer Movie in National Awards
 

సోమవారం ఢిల్లీలో జరిగిన 67వ జాతీయ అవార్డుల వేడుకల్లో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరిలో సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమా నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మహర్షి సినిమాకు బెస్ట్ పాపులర్ మూవీ వినోదాత్మక సినిమాగా ఈ అవార్డ్ అందుకుంది. మహర్షి టీం తరపున నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ వంశీ పైడిపల్లి ఈ అవార్డ్ అందుకున్నారు.

అంతేకాదు మహర్షి సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం మాస్టర్ కు అవార్డ్ లభించింది. 67వ జాతీయ అవార్డుల్లో నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాకు కూడా అవార్డుల పంట పండింది. ఉత్తమ తెలుగు సినిమాగా జెర్సీ నిలవగా.. బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో కూడా జెర్సీకి అవార్డ్ వచ్చింది. మొత్తానికి ఈసారి నేషనల్ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయని చెప్పొచ్చు. మహేష్ మహర్షి, నాని జెర్సీ సినిమాలకు అవార్డులు వచ్చాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All