Homeటాప్ స్టోరీస్ఆ థీమ్ తో కథ రెడీ చేస్తే మహేష్ కూడా రెడీ!

ఆ థీమ్ తో కథ రెడీ చేస్తే మహేష్ కూడా రెడీ!

ఆ థీమ్ తో కథ రెడీ చేస్తే మహేష్ కూడా రెడీ!
ఆ థీమ్ తో కథ రెడీ చేస్తే మహేష్ కూడా రెడీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకున్న విషయం తెల్సిందే. మహేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ చిత్రం. ఇప్పటికే డిజిటల్ రిలీజ్ కూడా అయిపోగా సరిలేరు థియేటర్లలో ఇంకా సందడి చేస్తుండడం విశేషం. ఇంత పెద్ద విజయం సాధించిన చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్న డైలమా మహేష్ లో ఉంది. అందుకే ఇంకా ఏ సినిమాను కన్ఫర్మ్ చేయలేదు.

మహేష్ మొదట వంశీ పైడిపల్లితో సినిమాకు కమిటయ్యాడు. అయితే వంశీ చెప్పిన ఫైనల్ నరేషన్ విన్న మహేష్ పూర్తి కాన్ఫిడెంట్ గా ఫీలవ్వలేకపోయాడు. అందుకే ఆ కథను వద్దనుకున్నాడు. మహేష్ కోసం వంశీ ఒక స్పై థ్రిల్లర్ కథను సిద్ధం చేసాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఇలాంటి కథలు తనకు సెట్ అవ్వవని అనుకుంటున్నాడు.

- Advertisement -

అందుకే మహేష్ మరియు నమ్రత తనతో సినిమాలు చేయాలనుకునే దర్శకులకు ఒక థీమ్ ను ఇచ్చారట. బ్యాంక్ స్కామ్స్ ను ఆధారంగా చేసుకుని కథలు రెడీ చేసుకుని రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ థీమ్ తో ఎవరు సరైన కథతో వస్తే వాళ్లతో సినిమా చేయడానికి మహేష్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి అలాంటి కథతో ఏ దర్శకుడు ముందుకు వస్తాడో చూడాలి.

ఈలోగా మహేష్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇందు కోసం 30 రోజుల కాల్ షీట్స్ ను కూడా కేటాయించాడట సూపర్ స్టార్. అలాగే ఈ చిత్రంలో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇది పూర్తవ్వగానే పరశురామ్ తో సినిమాను చేసే అవకాశాలున్నాయి. లేదంటే పైన చెప్పిన కథతో ఎవరైనా ముందుకు వస్తే వారితో సినిమా చేయాలనుకుంటున్నాడు. మొత్తానికి సరిలేరు వంటి విజయం తర్వాత మహేష్ తన ఆప్షన్స్ ను ఓపెన్ గా పెట్టుకోవడం విశేషమే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All