
మహేష్ బాబు ఫ్యాన్స్ మహర్షి దర్శకులు వంశీ పైడిపల్లిని అవమానిస్తున్నారు . మహర్షి సినిమా తీసి మహేష్ కు ఇచ్చిన హిట్ చాలు మళ్ళీ మళ్ళీ మా వాడితో సినిమా వద్దు వదిలేయండి మా వాడిని అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం గత నెలలో విడుదలైన విషయం తెలిసిందే .
మే 9 న భారీ ఎత్తున విడుదలైన మహర్షి చిత్రం ఆశించిన స్థాయిలో అన్ని చోట్లా విజయం సాధించలేకపోయింది దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ వంశీ పైడిపల్లి మీద కోపంగా ఉన్నారు . ఇక మళ్ళీ వంశీ పైడిపల్లి తో మహేష్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంకు తోడు మహేష్ బాబు విదేశాలకు వెళితే వాళ్లతో పాటుగా వంశీ పైడిపల్లి కూడా వెళ్ళాడు తన భార్యతో . విదేశాలలో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాడు ఈ దర్శకుడు దాంతో మా మహేష్ బాబు ని వదిలేయ్ బాబు అంటూ వంశీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .