Homeటాప్ స్టోరీస్నాగార్జున పై మహేష్ ఫ్యాన్స్ దాడి

నాగార్జున పై మహేష్ ఫ్యాన్స్ దాడి

mahesh fans attacks on nagarjuna కింగ్ నాగార్జున పై మహేష్ బాబు ఫ్యాన్స్ దాడి చేస్తున్నారు . నాగార్జున పై మహేష్ బాబు ఫ్యాన్స్ కు కోపం ఎందుకు ? అతడి పై దాడి చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇటీవల గూఢచారి సక్సెస్ మీట్ కు నాగార్జున హాజరై ఈ ఏడాది లో ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయని రంగస్థలం , మహానటి చిత్రాల తర్వాత అంతటి హిట్ గూఢచారి మాత్రమే అంటూ అనడమే ఈ వివాదానికి కారణమయ్యింది . ఈ ఏడాది రంగస్థలం , మహానటి భారీ విజయాలు అందుకున్నాయి అయితే వాటితో పాటుగా మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది .

అంతేకాదు ఛలో , సమ్మోహనం , ఆర్ ఎక్స్ 100 వంటి చిత్రాలు కూడా హిట్ అయ్యాయి ఇక డబ్బుల పరంగా ఆర్ ఎక్స్ 100 సంచలనమే సృష్టించింది కానీ నాగార్జున మాత్రం రంగస్థలం , మహానటి , గూఢచారి చిత్రాలను మాత్రమే ఉదాహరించడంతో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను ప్లాప్ అని పరోక్షంగా చెప్పినట్లే కదా ! అందుకే నాగార్జున ని ట్రోల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ . నాగార్జున బ్యాంక్ ల దగ్గర అప్పులు తీసుకొని వాటిని కట్టకుండా ముంచేసాడని రకరకాల కామెంట్లు చేస్తున్నారు . అయితే ఈ దాడి మరీ ఎక్కువగా ఉంది ఇటీవలే పలువురు పై మహేష్ ఫ్యాన్స్ ఇలాగె దాడి చేస్తున్నారు . అది మహేష్ కు వ్యక్తిగతంగా ఇబ్బంది తెచ్చేలా ఉంది . అందుకే కాబోలు హీరోలం మేము మేము బాగానే ఉంటాం కానీ ఫ్యాన్స్ మాత్రమే గొడవలు పెట్టుకుంటారు ఇకనైనా మారండి అని చెప్పాడు కూడా కానీ మారడం లేదు .

- Advertisement -

English Title: mahesh fans attacks on nagarjuna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All