Homeన్యూస్అన్నపూర్ణ స్టూడియో లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న మహేష్

అన్నపూర్ణ స్టూడియో లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న మహేష్

అన్నపూర్ణ స్టూడియో లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న మహేష్
అన్నపూర్ణ స్టూడియో లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబుకీర్తి సురేష్ జంటగా పరుశురాం డైరెక్షన్లో చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్ లో సంచలన వ్యూస్ రాబడుతుంది. ఇదిలా ఉంటె ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతున్నట్లు సమాచారం.

మహేశ్, ఫైటర్స్ మీద ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు భారీ ఫైట్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె ఈ మూవీ మీద ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లో, అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసింది.

- Advertisement -

మునుపెన్నడూ చూడని విధంగా మహేష్ బాబును చూపించబోతోన్నారు. సర్కారు వారి పాట సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక ఒక స్ట్రాంగ్ మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అంటున్నారు. మరి అది ఎలా ఉంటుందనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All