Homeటాప్ స్టోరీస్వివాదంలో మహేష్ బాబు చిత్రం

వివాదంలో మహేష్ బాబు చిత్రం

mahesh bharath ane nenu in troubleమహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం వివాదంలో ఇరుక్కుంది . మహేష్ సినిమా విడుదలై మూడు వారాలు దాటింది పైగా మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి అయినప్పటికీ ఇప్పుడు వివాదం ఏంటి ? అని అనుకుంటున్నారా ? భరత్ అనే నేను చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే కాగా ఆ చిత్రంలో నవోదయం పేరుతో రాజకీయ పార్టీ ఉంటుంది అది మా అనుమతి లేకుండా మా రాజకీయ పార్టీ పేరు ఎలా వాడుకుంటారని ప్రశ్నిస్తున్నారు దాసరి రాము అనే వ్యక్తి .

మా పార్టీ పేరు వాడుకున్నప్పుడు మా అనుమతి తప్పనిసరి కానీ కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నవోదయం పార్టీ నాయకులు . ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో చూడాలి . ఇక ఇదే దర్శకుడు కొరటాల శివ తో మహేష్ బాబు చేసిన చిత్రం శ్రీమంతుడు . ఆ సినిమా కథ విషయంలో పెద్ద వివాదమే నడిచింది . శరత్ అనే వ్యక్తి శ్రీమంతుడు అనే కథ నాదేనంటూ ఛాంబర్ తో పాటుగా కోర్టుకు కూడా ఎక్కాడు . ఇప్పుడేమో భరత్ అనే నేను సినిమా వివాదం లోకెక్కింది . మొత్తానికి కొరటాల శివ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All