Homeటాప్ స్టోరీస్సి ఐ డి పాత్రలో మహేష్ బాబు

సి ఐ డి పాత్రలో మహేష్ బాబు

mahesh babu will play the role of cid in sukumar filmమహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . భరత్ అనే నేను చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ చాలా సంతోషంగా ఉన్నాడు . ప్రస్తుతం తన 25 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి సమాయత్తం అవుతున్నాడు . కాగా ఆ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి దాని తర్వాత మరో నేపథ్యం ఉన్న చిత్రాన్ని చేయాలనీ భావిస్తున్నాడు మహేష్ .

ఇక రంగస్థలం చిత్రంతో నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచాడు సుకుమార్ . భారీ వసూళ్లు సాధించడమే కాకుండా రంగస్థలం చిత్రం ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది . దాంతో సుకుమార్ కు మహేష్ వెంటనే తన తదుపరి సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చాడు . మహేష్ తో ఇంతకుముందు 1నేనొక్కడినే చిత్రం చేసాడు సుకుమార్ అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది దాంతో మహేష్ కోసం ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఒక కథ చేయాలనీ డిసైడ్ అయ్యాడట ! ఇక ఇందులో మహేష్ బాబు సి ఐ డి అధికారిగా కనిపించనున్నాడు . కృష్ణ సి ఐ డి పాత్రల్లో సంచలనం సృష్టించాడు అప్పట్లో , మరి మహేష్ ఇప్పుడు సి ఐ డి అధికారిగా ఎలాంటి సంచలనం సృష్టించనున్నాడో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All