Homeటాప్ స్టోరీస్మహేష్ - త్రివిక్రమ్ చిత్రం మరింత వెనక్కి

మహేష్ – త్రివిక్రమ్ చిత్రం మరింత వెనక్కి

మహేష్ - త్రివిక్రమ్ చిత్రం మరింత వెనక్కి
మహేష్ – త్రివిక్రమ్ చిత్రం మరింత వెనక్కి

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయి రెండు నెలలు పూర్తి కావొస్తోంది. జులై నుండి ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టాలని మొదట భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఆ ప్లాన్స్ ను పూర్తిగా అడియాశలు చేసింది.

ప్రస్తుతం మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయమైనా పడుతుంది. ఈ నేపథ్యంలో మహేష్ – త్రివిక్రమ్ సినిమా మరింత వెనక్కి వెళుతోంది.

- Advertisement -

అయితే త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో గతేడాది ఆరంభంలో విడుదలైంది. ఆ తర్వాత నుండి త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాడు. ముందుగా ఎన్టీఆర్ సినిమా అనుకున్నాడు కానీ తర్వాత అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలిసి వర్క్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All