
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క బిజినెస్ లు , పలు సేవ కార్య క్రమాలతో పాటు అనేక బ్రాండ్ లకు కూడా అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అయన చేతికి మరో ప్రతిష్టాత్మక బ్రాండ్ వచ్చింది. అంతర్జాతీయ కార్ల బ్రాండ్ కొత్త వెంచర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యారు.
ధనవంతులు మాత్రమే వాడే ఆడి కార్ లోని ఎలక్ట్రికల్ వేరియంట్ కి ఇప్పుడు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం మీద మహేష్ బాబు పేరుతో ఆడి మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా దీనికి సంబంధించిన యాడ్ కూడా ఒకటి చిత్రీకరించారని తెలుస్తోంది యాడ్ అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకుగాను భారీ పారితోషికం కూడా ఆయన తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.