Homeటాప్ స్టోరీస్రాయల్ ఎన్ ఫీల్డ్ తో అదరగొడుతున్న మహేష్

రాయల్ ఎన్ ఫీల్డ్ తో అదరగొడుతున్న మహేష్

Mahesh babu stunning look with royal enfieldటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాయల్ ఎన్ ఫీల్డ్ తో ఉన్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రాయల్ ఫీల్డ్ పై రాయల్ లుక్ లో అదరగొడుతున్నాడు మహేష్ , ఈ లుక్ కి మహేష్ ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు . స్పందన అద్భుతంగా ఉండటంతో హాట్ టాపిక్ అయ్యింది . అయితే ఈ లుక్ సినిమాలోదా ? లేక ఏదైనా యాడ్ షూటింగ్ లోనిదా ? అన్న విషయం తెలియాల్సి ఉంది . మహేష్ బాబు సినిమాలతో పాటుగా యాడ్స్ లలో కూడా నటిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ప్రస్తుత మహేష్ స్టిల్ ఎందులోనిది అన్న ఆసక్తి అభిమానుల్లో ఎక్కువయ్యింది . మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అందునా అమ్మాయిల ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ కావడంతో వాళ్ళు సైతం ఈ స్టిల్ పట్ల ఆత్రుతగా ఆసక్తిగా ఉన్నారు .

తాజాగా మహేష్ బాబు పలు యాడ్ లలో నటిస్తూనే మరోవైపు మహర్షి చిత్రం చేస్తున్నాడు . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు . ఇక ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా దిల్ రాజు , అశ్వనిదత్ , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .

- Advertisement -

English Title : Mahesh babu stunning look with royal enfield

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All