
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఏదొక అప్డేట్ ఇస్తూ ఉంటాడు. అది మహేష్ అభిమానులకు మంచి ఫీస్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతేడాది అలానే సర్కారు వారి పాట చిత్రాన్ని అనౌన్స్ చేసాడు.
ఈ ఏడాది మొదట్లో దుబాయ్ లో సర్కారు వారి పాట షూటింగ్ నెల రోజుల పాటు సాగింది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే కరోనా కేసులు పెరిగిపోవడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించి మే 31న భారీ అప్డేట్ ఉంటుందని, చిన్న టీజర్ లాంటిది విడుదల చేస్తారని ప్రచారం బలంగా జరిగింది.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, మే 31కి ఎలాంటి సర్ప్రైజ్ ఉండబోదని తెలుస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సెలబ్రేట్ చేసుకునే సందర్భం కాదని, అందుకే ఎలాంటి అప్డేట్ ఇవ్వబోవట్లేదని సర్కారు వారి పాట టీమ్ అభిప్రాయపడింది.
In view of current circumstances there won’t be any updates from #SarkaruVaariPaata team on May 31st @urstrulyMahesh @MBofficialTeam pic.twitter.com/5kdKjV2NwT
— Vamsi Kaka (@vamsikaka) May 26, 2021