Homeటాప్ స్టోరీస్మహేష్ - రష్మిక... లిప్ లాక్?

మహేష్ – రష్మిక… లిప్ లాక్?

Mahesh babu rasmika mandanna lip lock in sarileru neekevvaru
Mahesh babu rasmika mandanna lip lock in sarileru neekevvaru

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల అనంతరం మహేష్ నుంచి రాబోతున్న మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా కావడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమాకు సంబందించిన గాసిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

ఇక ఇప్పుడు మరొక రూమర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. మహేష్ సినిమాలో లిప్ లాక్ కూడా ఇవ్వబోతున్నట్లు టాక్. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే దూకుడు – బిజినెస్ మెన్ సినిమాల్లో లిప్ లాక్ ఇచ్చిన మహేష్ ఇప్పుడు మరోసారి అలాంటి రొమాంటిక్ సీన్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రష్మిక మందన్న కూడా గత చిత్రాలలో లిప్ లాక్స్ తో వెండితెరను హీటెక్కించింది.

- Advertisement -

ఇప్పుడు సూపర్ స్టార్ తో కూడా ముద్దుకి రెడీ అవుతుండడంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఇంకా చిత్ర యూనిట్ సినిమాకు సంబందించిన అసలైన ప్రమోషన్స్ డోస్ అయితే స్టార్ట్ చేయలేదు. కానీ ఇలాంటి గాసిప్స్ మాత్రం సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని చిత్ర యూనిట్ మాత్రం ఇప్పట్లో క్లారిటీ ఇచ్చేలా లేదు. సో సినిమా రిలీజ్ వరకు ఈ వార్త హాట్ టాపిక్ కావాల్సిందే.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All