Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ని మెచ్చుకున్న మహేష్

విజయ్ దేవరకొండ ని మెచ్చుకున్న మహేష్

Mahesh babu praises vijay devarakondaఇప్పుడు విజయ్ దేవరకొండ టైం నడుస్తోందని , గీత గోవిందం విజయాన్ని ఎంజాయ్ చేయమంటూ కితాబు నిస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . ఆగస్టు 15న విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం విడుదలై సంచలన విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ కు శుభాకాంక్షలు అందజేయగా తాజాగా మహేష్ బాబు విజయ్ ని పొగుడుతూ ట్వీట్ చేయడంతో విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు .

గీత గోవిందం విజయం సాధించిన నేపథ్యంలో మహేష్ బాబు దగ్గరకు వెళ్లి కలిసాడు విజయ్ దేవరకొండ . ప్రస్తుతం మహేష్ మహర్షి షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే , కాగా విజయ్ దేవరకొండ ఆ షూటింగ్ స్పాట్ కే వెళ్లి మహేష్ ని కలిసాడు . ఆ సందర్బంగా విజయ్ పై ప్రశంసలు కురిపించాడు మహేష్ , సూపర్ స్టార్ మహేష్ తనని పొగడటంతో అంతే రెస్పెక్ట్ అతడికి ఇస్తున్నాడు ఈ యంగ్ సెన్సేషన్ . సోషల్ మీడియాలో అటు మహేష్ ట్వీట్ ఇటు విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్ గా మారుతోంది .

- Advertisement -

English Title: mahesh babu praises vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All