Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ ఫై మహేష్ బాబు ప్రశంసల వర్షం..

భీమ్లా నాయక్ ఫై మహేష్ బాబు ప్రశంసల వర్షం..

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన హై ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర డైరెక్షన్లో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించిన ఈ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మొదటి రోజు మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ రావడం తో అభిమానులు, మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ మూవీ ఫై సోషల్ మీడియా లో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. ఇప్పటికే దర్శకులు , పలువురు హీరోలు వారి అభిప్రాయాన్ని తెలియజేయగా..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ , రానా ల యాక్టింగ్ ఫై ప్రశంసల జల్లు కురిపించి అభిమానుల్లో సంతోషం నింపారు.

- Advertisement -

తాజాగా భీమ్లా నాయక్ చిత్రాన్ని చూసిన మహేష్.. ట్విట్టర్ వేదికగా ”భీమ్లా నాయక్ ఇంటెన్స్ మరియు ఎలక్ట్రిఫైయింగ్.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాడు! పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వాట్ ఏ పెర్ఫార్మెన్స్!! ‘డేనియల్ శేఖర్’గా రానా దగ్గుబాటి సంచలనం సృష్టించాడు.. వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్!! త్రివిక్రమ్ రచన ఎప్పటిలాగే పదునైనది తెలివైనదిగా ఉంది. ఇటీవలి కాలంలో ఉత్తమమైనది”

”రవి కె చంద్రన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. నాకు ఇష్టమైన కెమెరా మెన్ లలో ఒకరు!! థమన్ అందించిన మ్యూజిక్ స్కోర్ మిమ్మల్ని వెంటాడుతుంది మరియు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది!! సెన్సేషనల్!! సాగర్ కె చంద్ర – నాగవంశీ – నిత్యా మీనన్ – సంయుక్త మీనన్ మరియు మొత్తం టీమ్ కి నా అభినందనలు!!” అని మహేష్ బాబు ట్వీట్ లో పేర్కొన్నారు. మహేష్ బాబు ట్వీట్స్ తో సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All