Homeటాప్ స్టోరీస్మహేష్ కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రారంభం

మహేష్ కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రారంభం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ” సరిలేరు నీకెవ్వరు ” ఈరోజు ప్రారంభమైంది . ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020 జనవరిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ చిత్రాన్ని అనిల్ సుంకర , దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .

- Advertisement -

 

ఇటీవలే మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి కి ఛాన్స్ ఇచ్చాడు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ కావడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక యధావిధిగా మహేష్ బాబు ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనలేదు సెంటిమెంట్ ప్రకారం . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All