HomeVideosతాప్సి మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేష్ బాబు

తాప్సి మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేష్ బాబు

Mahesh Babu Launches Trailer of Taapsee Pannu's Telugu Film Mishan Impossible
Mahesh Babu Launches Trailer of Taapsee Pannu’s Telugu Film Mishan Impossible

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలు మాత్రమే కాకుండా ఇతర హీరోలు , హీరోయిన్లు నటించిన చిత్రాలకు కూడా ప్రమోషన్ చేస్తూ ఆ సినిమాలకు బజ్ తీసుకొస్తుంటారు. తాజాగా తాప్సి ప్రధాన పాత్రలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్(మిషాన్) ఇంపాజిబుల్’.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్‌జె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ ఆర్ఎస్‌జె తనదైన తరహా రచన, టేకింగ్‌తో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడించారు. సినిమాలో చేసిన పిల్లల యాక్టింగ్, తాప్సీ ఈ సినిమాకి ప్రధాన హైలెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All