Homeటాప్ స్టోరీస్శోభిత పై మహేష్ ఫ్యాన్స్ దాడి

శోభిత పై మహేష్ ఫ్యాన్స్ దాడి

mahesh babu fans fires on shobhita dhulipala గూఢచారి చిత్రంలో హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల పై మహేష్ బాబు ఫ్యాన్స్ దాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో . శోభిత కు మహేష్ ఫ్యాన్స్ కు సంబంధం ఏంటంటే ……. ఇటీవల మహేష్ బాబు గూఢచారి చిత్రాన్ని చూశాడట ! అది బాగా నచ్చడంతో హీరో అడవి శేష్ తో పాటుగా ఆ చిత్ర బృందాన్నీ అభినందిస్తూ ట్వీట్ చేసాడు . దానికి ప్రతిగా హీరోయిన్ శోభిత దూళిపాళ్ల థాంక్స్ చెప్పింది అంతే ! మహేష్ బాబు ఫ్యాన్స్ కు కోపం వచ్చింది . మహేష్ బాబు సూపర్ స్టార్ అలాంటి వ్యక్తి అభినందనలు తెలియజేస్తే కేవలం థాంక్స్ ఎలా చెబుతావ్ ……. సూపర్ స్టార్ మహేష్ బాబు అని సంభోదించాలి లేదంటే సార్ అనాలి అంటూ ఆ హీరోయిన్ పై దాడి చేస్తున్నారు .

ఇటీవలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆదర్శ్ బాలకృష్ణ ని టార్గెట్ చేసారు ఎందుకంటే ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ అని మాత్రమే సంభోదించాడు అయితే త్రివిక్రమ్ ని మాత్రం సార్ అని అన్నాడు దాంతో కోపానికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆదర్శ్ బాలకృష్ణ పై విమర్శలు చేసారు . కట్ చేస్తే ఇప్పుడు శోభిత దూళిపాళ్ల ని మహేష్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు . మహేష్ అంతటి పెద్ద స్టార్ చిన్న సినిమాని చూసి ట్వీట్ చేస్తే ఇలాగేనా స్పందించేది అని అభిమానుల బాధ అంతే ! అయితే ఈ విమర్శలపై శోభిత ఎలా స్పందిస్తుందో చూడాలి .

- Advertisement -

English Title: mahesh babu fans fires on shobhita dhulipala

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts