Homeటాప్ స్టోరీస్గోవా షెడ్యూల్ ముగించుకున్న మహేష్ బాబు

గోవా షెడ్యూల్ ముగించుకున్న మహేష్ బాబు

గోవా షెడ్యూల్ ముగించుకున్న మహేష్ బాబు
గోవా షెడ్యూల్ ముగించుకున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని రోజులుగా గోవాలో ఉన్న విషయం తెల్సిందే. అక్కడ సర్కారు వారి పాట తాజా షెడ్యూలా జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ప్రస్తుతం గోవా షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. మహేష్ స్పెషల్ ఫ్లైట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి అండ్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చారు.

ఇప్పటికే సర్కారు వారి పాట మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే సర్కారు వారి పాట టీమ్ మరో ఫారిన్ షెడ్యూల్ ను మొదలుపెడుతుంది. ఆ షెడ్యూల్ లో క్యాసినో సీన్ తో పాటు ఒక యాక్షన్ బ్లాక్ మరియు రెండు పాటలను షూట్ చేయాల్సి ఉంది.

- Advertisement -

వడ్డీలు ఎగ్గొట్టి బ్యాంకింగ్ వ్యవస్థ కళ్ళు కప్పే మోసగాళ్లను టార్గెట్ చేసే పాత్రలో మహేష్ కనిపిస్తాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All