Homeటాప్ స్టోరీస్మహేష్ డిజాస్టర్ సినిమా అక్కడ రిలీజ్ కి రెడీ

మహేష్ డిజాస్టర్ సినిమా అక్కడ రిలీజ్ కి రెడీ

Mahesh babu brahmotsavam tamil version gets release dateమహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత చెత్త చిత్రంగా రికార్డులు సృష్టించింది బ్రహ్మోత్సవం చిత్రం . 2016 లో విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా తమిళనాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ చిత్రానికి అక్కడ టైటిల్ ఏంటో తెలుసా …….. అనిరుధ్ . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే కాగా ఆ బ్రహ్మోత్సవాన్ని అనిరుధ్ పేరుతో భద్రకాళి ఫిలిమ్స్ విడుదల చేస్తోంది . మహేష్ సరసన సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత లు నటించగా సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు .

మహేష్ తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడే అలాగే సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత లతో పాటుగా సత్యరాజ్ ఉన్నాడు కాబట్టి ఓ మోస్తరు వసూళ్లు రావచ్చు దాని తర్వాత పరిస్థితి ఏంటో మరి . ఇక ఈ సినిమాని ఆగస్టు 3న విడుదల అనుకున్నారు కుదరలేదు దాంతో ఆగస్టు 10న అనుకున్నారు కానీ కమల్ విశ్వరూపం 2 విడుదల కాబట్టి వాయిదా వేశారు ఎట్టకేలకు ఆగస్టు 17న అనిరుధ్ విడుదల అవుతున్నాడు . రిలీజ్ అయితే అవుతోంది కానీ డౌటే ……. విజయం . మహేష్ కున్న క్రేజ్ ని సొంతం చేసుకోవడానికి రిలీజ్ చేసున్నారు అంతే !

- Advertisement -

English Title: mahesh babu brahmotsavam tamil version gets release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All