అగ్ర హీరోలు మహేష్ బాబు – ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు కానీ వాళ్ళ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తెగ తిట్టుకుంటున్నారు . ఇంతకీ మహేష్ అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు గొడవలు ఎందుకంటే ……. ఇటీవలే మహేష్ బాబు పుట్టినరోజు జరిగిన విషయం తెలిసిందే . ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు . అయితే ఎన్టీఆర్ విషెష్ కి మహేష్ స్పందించలేదు దాన్ని ఆసరాగా చేసుకొని ఎన్టీఆర్ గ్రీటింగ్స్ చెబితే మీ మహేష్ స్పందించలేదు అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు .
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ ని తిడుతుండటంతో కోపం పట్టలేక మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ని అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తిట్టడం మొదలు పెట్టారు . ఇంకేముంది ఇద్దరి అభిమానుల మధ్య యుద్ధం స్టార్ట్ కావడంతో ఒకరినొకరు తిట్టుకుంటూ మిగతావాళ్లకు ఆనందం పంచుతున్నారు . అయితే మహేష్ – ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అంతేకాదు హీరోలం మేము బాగానే ఉంటాం , స్నేహంగా ఉంటాం కానీ అభిమానులే గొడవలు పడుతుంటారు కనీసం ఇప్పుడైనా మారండి అంటూ భరత్ అనే నేను వేడుకలో అభిమానులనుద్దేశించి అన్నాడు మహేష్ కానీ అభిమానులు మాత్రం మారడం లేదు ఒకరినొకరు తిట్టుకుంటునే ఉన్నారు .
English Title: mahesh babu and ntr fans war in social media