
మహర్షి ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది . నిన్న రాత్రి విడుదలైన మహర్షి చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో అదరగొడుతోంది మహేష్ బాబు అభిమానుల మద్దతుతో . ఇప్పటికే 7 మిలియన్ వ్యూస్ దాటేసిన ఈ ట్రైలర్ ఈరోజు పూర్తయ్యేసరికి 10 మిలియన్ వ్యూస్ సాధించేలా కనబడుతోంది . మహేష్ బాబు ని విభిన్న కోణంలో ఈ ట్రైలర్ చూపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు .
ప్రస్తుతం యూట్యూబ్ లో మహర్షి ట్రైలర్ నెంబర్ పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది . ట్రైలర్ అద్భుత స్పందన వస్తుండటంతో సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . ఇక మే 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .