Friday, September 30, 2022
Homeఎక్స్ క్లూసివ్మహర్షి రివ్యూ

మహర్షి రివ్యూ

- Advertisement -

మహర్షి రివ్యూ
నటీనటులు : మహేష్ బాబు , అల్లరి నరేష్, పూజా హెగ్డే
సంగీతం : దేవిశ్రీప్రసాద్
నిర్మాతలు: అశ్వనీదత్ , దిల్ రాజు, పివిపి
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
రేటింగ్ : 3.5 / 5
రిలీజ్ డేట్ : 9 మే 2019

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది చూద్దామా ?

కథ :

రిషి కుమార్ ( మహేష్ బాబు) ఓరిజిన్ సీ ఈ ఓ గా నియమితులౌతాడు . ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలకు పైగా వ్యాపారాన్ని విస్తరించి ఉన్న ఓరిజిన్ సీ ఈ ఓ రిషి ని అభినందించడానికి రిషి కాలేజ్ స్నేహితులు అందరూ వస్తారు. కానీ పూజ ( పూజా హెగ్డే ) , రవి ( అల్లరి నరేష్) లు రారు. పూజా హైదరాబాద్ లో జాబ్ చేస్తోందని తెలుసుకుంటాడు కానీ రవి రాకపోవడానికి బలమైన కారణం ఉండటంతో పాటుగా తన జీవితం ఇలా ఉండటానికి కారకుడు రవి అని తెలుసుకున్న రిషి ఇండియాలోని రామవరం  కు వెళ్తాడు. అసలు రవికి ఏమైంది ? న్యూయార్క్ లో ఉండాల్సిన రిషి  రామవరం ఎందుకు చేరుకున్నాడు.  ఏం చేశాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

హైలైట్స్ :

మహేష్ బాబు
ఎమోషనల్ సీన్స్
అల్లరి నరేష్
నేపథ్య సంగీతం
కథ

డ్రా బ్యాక్స్ :

నిడివి

నటీనటుల ప్రతిభ :

కాలేజ్ స్టూడెంట్ గా , లీడింగ్ కంపెనీకి సి ఈ ఓ గా , రైతుగా మూడు కోణాల్లో కనిపించిన మహేష్ తన అభిమానులనే కాకుండా ప్రేక్షక లోకాన్ని సైతం మెప్పించాడు.  మహర్షి చిత్రాన్ని తన 25 వ సినిమాగా ఎంచుకొని మంచిపని చేసాడు . మహర్షి చిత్రాన్ని అభిమానులు తల ఎత్తుకునేలా , గర్వంగా చెప్పుకునేలా ఉంది ఈ 25 వ సినిమా. మూడు షేడ్స్ ఉన్న పాత్రని అవలీలగా పోషించి అద్భుతం అనిపించాడు మహేష్. సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రలో అల్లరి నరేష్ పాత్ర అద్భుతమే అని చెప్పాలి. చాలాకాలంగా హిట్ కోసం తపించిపోతున్న అల్లరి నరేష్ కు మంచి పాత్ర లభించింది.
దాన్ని అల్లరి నరేష్ సద్వినియోగం చేసుకున్నాడు. పూజా హెగ్డే గ్లామర్ తో అలరించింది అయితే అంతగా నటించడానికి ప్రాధాన్యత లేకుండాపోయింది. కార్పోరేట్ విలన్ గా జగపతిబాబు మెప్పించాడు. ఇక మిగిలిన పాత్రల్లో రావు రమేష్, సాయి కుమార్ , జయసుధ , ప్రకాష్ రాజ్ , శ్రీనివాస్ రెడ్డి , పోసాని తదితరులు తమతమ పాత్రల్లో అలరించారు.

సాంకేతిక వర్గం :

భారీ నిర్మాణ విలువలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించి తమ అభిరుచి చాటుకున్నారు అశ్వినిదత్ , దిల్ రాజు , పివిపి లు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాతలు పెట్టిన ఖర్చుని తెరమీద బాగా చూపించాడు. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన పాటల్లో రెండు మాత్రమే బాగున్నాయి. అయితే మిగతా పాటలు చూడటానికి బాగానే ఉన్నాయి. పదర పదరా అనే పాట హైలెట్ గా నిలిచింది. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి విషయానికి వస్తే…. సినిమాని గ్రాండియర్ గా చూపించాడు. మహేష్ ని మూడు గెటప్ లలో చూపించి మెప్పించాడు. రైతు సమస్యల పై మంచి కథ ని ఎంచుకొని చాలా మంచి ప్రయత్నం చేసాడు. అయితే స్క్రీన్ ప్లే లోమరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.

 

ఓవరాల్ గా :

మహేష్ అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా మహర్షి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts