Wednesday, October 5, 2022
Homeటాప్ స్టోరీస్67వ జాతీయ పుర‌స్కా‌రాల్లో `మ‌హ‌ర్షి`కి అవార్డుల పంట‌!

67వ జాతీయ పుర‌స్కా‌రాల్లో `మ‌హ‌ర్షి`కి అవార్డుల పంట‌!

67వ జాతీయ పుర‌స్కా‌రాల్లో `మ‌హ‌ర్షి`కి అవార్డుల పంట‌!
67వ జాతీయ పుర‌స్కా‌రాల్లో `మ‌హ‌ర్షి`కి అవార్డుల పంట‌!

67వ జాతీయ పుర‌స్కారాల్ని కేంద్రం ఈ రోజు ప్ర‌క‌టించింది. తెలుగు నుంచి ఉత్త‌మ జాతీయ చిత్రంగా నాని న‌టించిన `జెర్సీ` ఎంపిక కాగా, ఇదే చిత్రానికి ఉత్త‌మ ఎడి‌టింగ్ విభాగంలోనూ న‌వీన్ నూలికి అవార్డు ల‌భించింది. ఇక వ్య‌వ‌సాయం ప్రాధాన్య‌త‌ని, అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తూ తెర‌కెక్కిన చిత్రం `మ‌హ‌ర్షి`కి రెండు విభాగాల్లో అవార్డులు ద‌క్కాయి. మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఈ చిత్రం 2019 మే 9న విడుద‌లైంది.

- Advertisement -

దిల్ రాజు, సి. అశ్వ‌నీద‌త్‌, ప్ర‌సాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి 67వ జాతీయ అవార్డుల్లో మూడు పురస్కారాలు ల‌భించాయి. ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రం, ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ (రాజు సుంద‌రం). ఉత్త‌మ నిర్మాణ సంస్థ శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ల‌కు అవార్డులు ద‌క్కాయి.

త‌మ చిత్రానికి 67వ జాతీయ పుర‌స్కారాల్లో మూడు అవార్డులు ద‌క్క‌డంతో నిర్మాత దిల్ రాజు, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, హీరో మ‌హేష్‌ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts