సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో పాటు.. పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు మే 8 (బుధవారం) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ”మహేష్‌బాబు కెరీర్‌లో 25వ సినిమా, ఒక ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ అయిన ‘మహర్షి‘.. ఇంకా కొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్‌బాబుగారి కెరీర్‌లో కొన్ని టాప్ ఫిలింస్ ఉన్నాయి. అలాగే ‘మహర్షి’ సినిమా కూడా వాటి సరసన చేరబోతుంది. నేను ఇది వరకు చెప్పినట్లు.. ఫ్యాన్స్ ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినా సరే.. ‘మహర్షి’ అన్నింటినీ రీచ్ అవుతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెబుతున్న మాట కాదు. ఈ సినిమాతో నేను చేసిన ట్రావెల్, కథ విన్నప్పుడు నేను ఫీలైన ఎగ్జయిట్‌మెంట్‌తో ఇది చెబుతున్నాను. మూడు రోజుల క్రితమే సినిమా చూశాను. కొన్ని సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయవు. అలాంటి ఓ స్టార్ సినిమాకి కావాల్సిన గ్రేట్ మూమెంట్స్‌తో పాటు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌లు ‘మహర్షి’లో ఉన్నాయి. మా బేనర్‌లో కాకుండా ఏ ప్రొడ్యూసర్ ఈ సినిమా తీసినా నేను ఇలాగే ఫీలయ్యేవాడ్ని. అంత గ్రేట్ ఫిల్మ్. మే 9న అశ్వనీదత్‌గారి వైజయంతి మూవీస్ బేనర్‌లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ వంటి సూపర్‌హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ‘మహర్షి’ సినిమా కూడా వాటి సరసన నిలవబోతోంది. అలాగే పివిపిగారికి సినిమా అంటే ప్యాషన్. మేం ముగ్గురం కలిసి ఈ సినిమా నిర్మించడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. వంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతో వంశీ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలవబోతున్నారు. దేవిశ్రీప్రసాద్, డిఓపి మోహనన్, కథలో వంశీతో ట్రావెల్ అయిన హరి, సాల్మాన్.. ఆర్టిస్ట్‌లు నరేష్, ప్రకాష్‌రాజ్, జయసుధ, పూజా హెగ్డే, జగపతిబాబు ఇలా ప్రతి ఒక్కరూ సినిమాకి ఎంత పార్టిసిపేషన్ ఇవ్వాలో అంత ఇచ్చి ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు.
‘మహర్షి’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అవ్వడం వల్ల వరల్డ్‌వైడ్‌గా హ్యూజ్ రిలీజ్‌కి ప్లాన్ చేశాం. అలాగే తెలంగాణ గవర్నమెంట్‌ని 5వ షోకి పర్మిషన్ అడిగాం. వారు అంగీకరించి నిన్ననే జీ.ఓ ఇవ్వడం జరిగింది. దాని వల్ల హైదరాబాద్‌లో 15 నుండి 20 థియేటర్స్‌లో ఉదయం 8 గంటలకి షో వేయబోతున్నారు. అలాగే తెలంగాణలోని డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్‌లో 30-35 థియేటర్స్‌లో ఉదయం 8 గంటలకు షో వేయబోతున్నారు. నిన్న జీ.ఓ వచ్చిన తర్వాత అడ్మిషన్ రేట్ల విషయంలో చిన్న మిస్ కమ్యూనికేషన్ ట్రావెల్ అయ్యింది. తెలంగాణ గవర్నమెంట్ కాకుండా థియేటర్ ఓనర్సే కోర్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రలో కొన్ని చోట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి తీసుకోవడం జరిగింది. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు సినిమాకి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉన్న స్కోప్‌లో ఎగ్జిబిటర్స్ కోర్టు ద్వారా ఇలా కొన్ని కొన్ని చోట్ల రేట్లు పెంచడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ హైక్ ఒక వారం పాటు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.
‘మహర్షి’ ఓ ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది – దిల్‌రాజు
- Advertisement -
- Advertisement -
Advertisement