Homeటాప్ స్టోరీస్వన్ మిలియన్ మార్క్ ని టచ్ చేస్తున్న మహానటి

వన్ మిలియన్ మార్క్ ని టచ్ చేస్తున్న మహానటి

mahanati towards one millionఓవర్ సీస్ లో వన్ మిలియన్ మార్క్ ని టచ్ చేస్తోంది మహానటి చిత్రం . మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు ఎందుకంటే స్టార్ హీరోలు లేరు దానికి తోడు పెద్ద డైరెక్టర్ తీసిన చిత్రం కాదు దాంతో పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి మొదట్లో . అయితే ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో , సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ గెటప్ చూసారో అప్పుడు మహానటి పై కాస్త అంచనాలు పెరిగాయి ఇక విడుదలకు ముందు ఆ అంచనాలు మరింతగా పెరిగాయి దాంతో ఓవర్ సీస్ లో కూడా విడుదల చేయగా ప్రీమియర్ షోలతోనే 2 కోట్ల వసూళ్ల ని రాబట్టింది మహానటి చిత్రం .

మొత్తానికి నాలుగు రోజుల్లో $ 882, 106 డాలర్ల ని వసూల్ చేయడంతో వన్ మిలియన్ మార్క్ కి కాస్త దూరంలో ఉంది , ఇకపోతే ఈ ట్రెండ్ చూస్తుంటే ఓవర్ సీస్ లో మహానటి 2 మిలియన్ డాలర్ల కు పైగా వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది . మూడు మిలియన్ డాలర్లు వసూల్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మహానటిగా కీర్తి సురేష్ అభినయానికి ముగ్దులవుతున్నారు ప్రేక్షకులు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో బయోపిక్ లకు సరికొత్త ఊపు నిచ్చాడు నాగ్ అశ్విన్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All