Homeటాప్ స్టోరీస్75 కోట్ల ని వసూల్ చేసిన మహానటి

75 కోట్ల ని వసూల్ చేసిన మహానటి

mahanati total world wide collectionsమహానటి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మీద 75 కోట్ల వసూళ్ల ని సాధించింది . తెలుగు , తమిళ్ భాషలతో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీ ఎత్తున విడుదల అయ్యింది మహానటి చిత్రం . సినిమా బాగుంటుందేమోలే అని అనుకున్న వాళ్లకు కళ్ళు తిరిగే వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అంతగా ఆదరించారు ప్రేక్షకులు , దాంతో 75 కోట్ల గ్రాస్ దాదాపు 43 కోట్ల షేర్ వసూల్ అయ్యింది .

చిన్న చిత్రంగా వచ్చిన మహానటి ప్రభంజనం సృష్టించడం ఒకటైతే ….. ఏమాత్రం స్టార్స్ లేని చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం మరింత సంచలనాన్ని నమోదు చేసింది . మహానటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది కీర్తి సురేష్ . సమంత – విజయ్ దేవరకొండ లతో పాటుగా మోహన్ బాబు , రాజేంద్రప్రసాద్ , దుల్కర్ సల్మాన్ , నాగచైతన్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు .

- Advertisement -

వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ గత కొంతకాలంగా సరైన హిట్స్ సాధించలేక ఆర్ధిక ఇబ్బందుల్లో పడిన సమయంలో చెరిగిపోని విజయాన్ని మహానటి అందించింది . ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు అశ్వనీదత్ . ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన అశ్వనీదత్ కు కష్టకాలంలో వచ్చిన ఈ మహానటి చెరిగిపోని ముద్ర ని వేసింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All