
ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం మూడు భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ మరో మూడు భారీ చిత్రాల్లో నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో `సలార్`, ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న మూవీ కూడా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
దీపికా పదుకునే హీరోయిన్‌గా, అబితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. సైంటిఫిక్ ఫిక్షన్‌గా త్వరలో తెరపైకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ని శుక్రావారం చిత్ర బృందం ప్రకటించింది.
త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి `మహానటి` టెక్నీషియన్స్‌ని రిపీట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని చిత్ర బృందంతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. `మహానటి` చిత్రానికి హాలీవుడ్ కెమెరామెన్ డానీ సాంచెజ్ లోపెజ్, మిక్కీ జే మేయర్ .. ప్రభాస్ చిత్రానికి పనిచేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి వీరికి వెల్కమ్ చెబుతూ చిత్ర బృందం, దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించారు.
We created a world from the past in mahanati…now we create a world from the future…welcome onboard guys ? https://t.co/ksamrO5B3v
— Nag Ashwin (@nagashwin7) January 29, 2021