Homeటాప్ స్టోరీస్మహానటి సావిత్రికి హైదరాబాద్ లో ఇల్లు

మహానటి సావిత్రికి హైదరాబాద్ లో ఇల్లు

mahanati savitri house in hyderabadమహానటి సావిత్రి అప్పట్లో బాగా డబ్బు సంపాదించడంతో చెన్నై తో పాటుగా పలు చోట్ల ఆస్థులను కొనడమే కాకుండా విలువైన భూములను సైతం కొంది , అందులో భాగంగానే హైదరాబాద్ లో కూడా సావిత్రి రెండు బంగళాలు కొన్నది . ఎందుకంటే హైదరాబాద్ లో షూటింగ్ లు జరుగుతుండేవి దాంతో హైదరాబాద్ వచ్చినప్పుడు తన సొంత ఇంట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడ విశాలమైన బంగ్లా కొన్నది . ఇక స్థలం కూడా చాలా పెద్దది ….. ఏకంగా ఎకరం స్థలం ఉంటుంది .

అయితే ఇంతకీ హైదరాబాద్ లో సావిత్రి ఇల్లు ఎక్కడో తెలుసా ……. ఇప్పుడు మధురానగర్ గా పిలవబడుతున్న ఏరియాలో కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా ఎకరం స్థలం కొన్నది . కృష్ణకాంత్ పార్క్ ఒకప్పుడు పెద్ద చెరువు కాలక్రమంలో డ్రైనేజ్ గా మారింది కట్ చేస్తే చంద్రబాబు హయాంలో ఆ చెరువు ని కృష్ణకాంత్ పార్క్ గా మారింది . అయితే మహానటి సావిత్రి అక్కడ ఎందుకు స్థలం కొందో తెలుసా ….. ఖాళీగా ఉన్న సమయంలో ఆ చెరువు ముందు కూర్చొని సేద తీరవచ్చని . అయితే ఆ ఇల్లు తన అక్క బావ పేరిట తీసుకోవడంతో వాళ్ళు ఆ పెద్ద ఇంటిని స్థలాన్ని అమ్మేశారు కట్ చేస్తే ఇప్పుడు అంతా అపార్ట్ మెంట్లు వెలిసాయి అక్కడ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All