Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్మహానటి రివ్యూ

మహానటి రివ్యూ

mahanati-reviewనటీనటులు : కీర్తి సురేష్ , సమంత , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ తదితరులు
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : అశ్వనీదత్ , స్వప్న దత్ , ప్రియాంక దత్
దర్శకత్వం : నాగ అశ్విన్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 9 మే 2018

- Advertisement -

 

 

మహానటి రివ్యూ :
మహానటి సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించాలని కొత్త కుర్రాడు నాగ్ అశ్విన్ చేసిన మంచి ప్రయత్నం ఈ ” మహానటి ” . సావిత్రి బయోపిక్ అనగానే ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది అయితే కొత్త కుర్రాడైన నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి బయోపిక్ ని సమర్థవంతంగా తెరకెక్కించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

మహానటి కథ :

పురుషాధిక్య సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత ని సంపాదించుకొని చరిత్ర సృష్టించిన మహానటి సావిత్రి . బాల్యం నుండి సావిత్రి చనిపోయేంత వరకు సాగిన ఈ చిత్రంలో ప్రధానంగా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ని కథా వస్తువుగా ఎంచుకున్నాడు .ఆనాటి సూపర్ స్టార్ లందరి సరసన నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి సావిత్రి . మహానటి గా ఎనలేని కీర్తి ప్రతిష్టలని సంపాదించిన సావిత్రి చివరి రోజుల్లో ఎలాంటి విషాదాన్ని చవిచూసింది అన్నదే ఈ చిత్ర సారాంశం .

మహానటి హైలెట్స్ :

కీర్తి సురేష్
సమంత
దుల్కర్ సల్మాన్
ఛాయాగ్రహణం
డైరెక్షన్

 

మహానటి డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో లిటిల్ బిట్ డ్రాగ్

 

మహానటి నటీనటుల ప్రతిభ :

మహానటి సావిత్రి పాత్రలోకి పరకాయప్రవేశం చేసి ఔరా ! అనిపించింది కీర్తిసురేష్ . హావ భావాలలో కానీ నడకలో , నడత లో అచ్చం సావిత్రి ని తలపించింది కీర్తి , ఒక్క ముక్కలో చెప్పాలంటే పాతతరం వాళ్లకు సైతం సావిత్రి ఇలానే ఉండేది కదా ! అని మైమరిచిపోయేలా చేసి అవార్డు పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కీర్తి సురేష్ . సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది అనేకంటే జీవించింది అంటే కరెక్ట్ . జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత అద్భుత నటన ని కనబర్చింది , సమంత చేసింది మెయిన్ పాత్ర కాకపోయినా ఎందుకు చేసిందో ఒక్క సీన్ చూస్తే తెలిసిపోతుంది . దుల్కర్ సల్మాన్ జెమిని గణేశన్ పాత్రలో రాణించాడు . విజయ్ దేవరకొండ పాత్ర బాగుంది . మోహన్ బాబు ఎస్వీఆర్ పాత్రలో , అక్కినేని పాత్రలో నాగచైతన్య , చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ , ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ , కెవి రెడ్డి పాత్రలో దర్శకులు క్రిష్ మెప్పించారు .

 

మహానటి సాంకేతిక వర్గం :

ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సంస్థ వైజయంతి మూవీస్ సంస్థ , అయితే అదంతా గతం , ఎన్నో బ్లాక్ బస్టర్ లను అందించిన ఆ సంస్థ గతకొంత కాలంగా పరాజయాలను చవిచూస్తూ ఆర్ధికంగా దెబ్బతింది , కట్ చేస్తే కొంత గ్యాప్ తర్వాత మహానటి చిత్రంతో మళ్ళీ నిర్మాణం మొదలు పెట్టింది . మహానటి నిర్మాణంతో రీ ఎంట్రీ ఇవ్వడం ముదావహం . ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ విషయానికి వస్తే ……. రెండో సినిమాతోనే సాహసాన్ని ప్రదర్శించాడు . మహానటి సినిమాని తెరకెక్కించడం పెద్ద సాహసమే ! అందునా కొత్త కుర్రాడు నాగ్ అశ్విన్ కు నిజంగా ఇది సాహసమే అని చెప్పాలి . కానీ ఆ సాహసాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేసాడు , దర్శకుడిగా మెప్పించాడు . మిక్కీ జె మేయర్ సంగీతం అలరించింది , లోపెజ్ అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది .

 

మహానటి ఓవరాల్ గా :

అలనాటి మేటి నటి మహానటి సావిత్రి బయోపిక్ తప్పకుండా నేటితరం చూడాల్సిన చిత్రం

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts