Homeటాప్ స్టోరీస్మహానటి మళ్ళీ వాయిదా పడింది

మహానటి మళ్ళీ వాయిదా పడింది

mahanati post poned onceagainమహానటి సావిత్రి బయోపిక్ మళ్ళీ వాయిదాపడింది . ఈపాటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సకాలంలో పూర్తికాకపోవడంతో మార్చి 29న విడుదల చేస్తామంటూ ప్రకటించారు ఆమధ్య , అయితే తాజాగా ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని మే 9న విడుదల చేస్తున్నామంటూ మళ్ళీ ప్రకటించారు . ఇక ఇప్పుడు కూడా మళ్ళీ వాయిదా పడటానికి కారణం ఏంటో తెలుసా ……. ఇంకా షూటింగ్ పార్ట్ చాలా భాగం మిగిలి ఉండటమే !

 

- Advertisement -

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది కాగా జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు . ఇటీవలే కీర్తి సురేష్ , దుల్కర్ సల్మాన్ ల లుక్ లను విడుదల చేసారు . ఆ ఇద్దరి లుక్ లు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉన్నాయి . నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం పై అశ్వనీదత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . చాలాకాలం తర్వాత అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం ఈ మహానటి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All