Homeటాప్ స్టోరీస్మహానటి టాక్ ఎలా ఉందంటే

మహానటి టాక్ ఎలా ఉందంటే

mahanati overseas talk మహానటి సావిత్రి బయోపిక్ ఈరోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే . కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించగా కీలక పాత్రల్లో సమంత , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ లు నటించారు . సమంత , విజయ్ దేవరకొండ లకు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల మహానటి చిత్రానికి ఆదరణ లభిస్తోంది . మొదటి నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చేలా ఉన్నాయి . ఇక ఈ చిత్రం ఓవర్ సీస్ లో అప్పుడే షోలు పడిపోయాయి అలాగే టాక్ కూడా వచ్చేసింది . ఇంతకీ ఓవర్ సీస్ టాక్ ప్రకారం ఎలా ఉందో తెలుసా …….

 

- Advertisement -

కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు ముగ్దులవడం ఖాయమట అలాగే సమంత , విజయ్ దేవరకొండ ల పాత్ర తక్కువే అయినప్పటికీ ఆ పాత్రలు కూడా ప్రేక్షకులను అలరించడం ఖాయమని అంటున్నారు . అలాగే పాతతరం నటులను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో ప్రేక్షకులు ప్రత్యేక అనుభూతి కి లోనవ్వడం ఖాయమట . మహానటి సినిమా బాగానే ఉన్నప్పటికీ ఇప్పటి యూత్ కు నచ్చుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఓవరాల్ గా మహానటి బాగానే ఉందని కానీ యూత్ కి నచ్చితేనే హిట్ అవుతుందని అంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All