
మలయాళం యాక్టర్ దుల్కర్ సల్మాన్ అంటే తెలియని సౌత్ ఆడియెన్స్ ఉండరు. చిరునువ్వుతోనే ఆడియెన్స్ మైండ్ లో ఫిక్స్ అయిపోయే హావభావాలను పలికించగల ఈ యువ హీరో తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. మహానటి సినిమాతో గత ఏడాది జెమిని గణేషన్ పాత్రలో కనిపించి టాలీవుడ్ కి బాగా దగ్గరయ్యాడు. అంతకుముందు మణిరత్నం డైరెక్షన్ లో చేసిన ఒకే బంగారం కూడా తెలుగు ఆడియెన్స్ ని మెప్పించింది.
మహానటి తరువాత తెలుగులో మళ్ళీ క్లిక్కవ్వని ఈ హీరో ఒక రీమేడ్ కథతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా విక్రమ్ ప్రబుతో స్క్రీన్ కూడా షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 1996 లో చియాన్ విక్రమ్ – థలా అజిత్ కలిసి నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఉల్లాసం’. మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఆ సినిమాను మళ్ళీ రీమేడ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కథ ఒరిజినల్ దర్శకులు జెడి – జెర్రీ మళ్ళీ ఈ కుర్ర హీరోలతో ఆ మల్టీస్టారర్ ని సరికొత్తగా తెరకెక్కించబోతున్నారు.
విక్రమ్ ప్రభు – దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తుండడంతో ఆ ప్రాజెక్ట్ పై స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలని దుల్కర్ సల్మాన్ సలహా మేరకు చిత్ర యూనిట్ సభ్యులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దుల్కర్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే మంచి కథ దొరికితే టాలీవుడ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇన్నాళ్లకు ‘ఉల్లాసం’ కథ కొంచెం తెలుగు ఆడియెన్స్ నచ్చేలా ఉందని డబ్బింబ్ అయినా పర్లేదు అని తెలుగు మార్కెట్ పై డైరెక్ట్ ఎటాక్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.
- Advertisement -