
ఆరెక్స్ 100తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి కొంత గ్యాప్ తర్వాత తన రెండో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మహా సముద్రం. ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేయబోతున్నారు. ఈరోజున మహా సముద్రం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.
అజయ్ భూపతి తన ఇమేజ్ కు తగ్గట్లుగానే మరో ఇంటెన్స్ కథతో మన ముందుకు వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. మహా సముద్రం ట్రైలర్ లో ముందుగా అందరినీ ఆకర్షించేవి ఇంటెన్స్ పాత్రలు. శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి, జగపతి బాబు, రావు రమేష్ ఇలా అందరి పాత్రలూ ఇంటెన్స్ గానే ఉన్నాయి.
ఇక ఆ తర్వాత డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతీ డైలాగ్ హార్డ్ హిట్టింగ్ గా ఉంది. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ కూడా ట్రైలర్ లో ప్రధాన ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తంగా మహా సముద్రం అంచనాలను ఈ ట్రైలర్ తో రెట్టింపు చేసుకుంది.
Presenting the sensational Theatrical Trailer of our #Mahasamudram
This one will be a journey of a lifetime. See you all in CINEMAS on October 14.https://t.co/00GnmGHXEw@ImSharwanand @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @chaitanmusic @AKentsOfficial— Siddharth (@Actor_Siddharth) September 23, 2021
