
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు, రావు రమేష్ తదితరులు
దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాత: అనిల్ సుంకర
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాధారణంగా ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే దానిపై ఆసక్తి కూసింత ఎక్కువే ఉంటుంది. అందులో దర్శకుడు ఆరెక్స్ 100 వంటి సంచలన చిత్రాన్ని తీసిన వాడు అయితే ఆ చిత్రానికి వచ్చే బజ్ వేరు. శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో అజయ్ భూపతి తీసిన మహా సముద్రం దసరా సందర్భంగా ఈరోజు విడుదలవుతోంది. ప్రోమోలతో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం మరి విడుదలయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.
చిత్ర యూనిట్ అయితే విజయంపై విపరీతమైన నమ్మకంతో ఉన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరీర్స్ లో బెస్ట్ చిత్రం అవుతుందన్న ధీమాను వ్యక్తం చేసారు. ఈ కథతో పాటు కథనం కూడా సరికొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ మహా సముద్రం విజయం చిత్ర యూనిట్ లో అందరికీ చాలా కీలకమే.
ఈ చిత్ర థియేట్రికల్ టార్గెట్ 8 కోట్లు. అంటే ఈ మార్క్ ను దాటితే చిత్రం హిట్ అనిపించుకుంటుంది. దసరా పండగ సెలవుల నేపథ్యంలో మంచి టాక్ వస్తే ఇదేమంత కష్టం కాకపోవచ్చు. అయితే మహా సముద్రానికి మరో రెండు చిత్రాల నుండి పోటీ ఉంది. సో సూపర్ హిట్ టాక్ వస్తేనే ఈ చిత్రం గట్టేక్కేది.