Homeటాప్ స్టోరీస్మేస్ట్రో రిలీజ్ ను ప్రకటించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్

మేస్ట్రో రిలీజ్ ను ప్రకటించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్

మేస్ట్రో రిలీజ్ ను ప్రకటించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మేస్ట్రో రిలీజ్ ను ప్రకటించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా మేస్ట్రో డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈరోజు అధికారిక ప్రకటన వచ్చింది. చిత్ర ట్రైలర్ ను ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతే కాదు సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమ్ అవుతుంది.

నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా కీలక పాత్ర పోషించింది. మహతి స్వర సాగర్ స్వరాలు అందించగా మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. శ్రేష్ట్ మూవీస్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అంధధూన్ చిత్రానికి ఈ సినిమా రీమేక్.

- Advertisement -

ఈ ఏడాది నితిన్ నటించిన రెండు సినిమాలు విడుదలవ్వగా చెక్ ప్లాప్ అయింది. రంగ్ దే యావరేజ్ తో సరిపెట్టుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All