Homeటాప్ స్టోరీస్మేస్ట్రో మూవీ రివ్యూ

మేస్ట్రో మూవీ రివ్యూ

Maestro Movie telugu aaReview
Maestro Telugu Review

నటీనటులు: నితిన్, నభ నటేష్, తమన్నానితిన్తరులు
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
సంగీతం: మహతి స్వర సాగర్
నిర్మాణ సంస్థ: శ్రేష్ఠ్ మూవీస్
రేటింగ్ : 2.75/5

నితిన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసాడు. చెక్, రంగ్ దే తనకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో నమరో సినిమాను విడుదల చేస్తున్నాడు. ఈసారి థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటిటి డిస్నీ + హాట్ స్టార్ లో ఈ చిత్రం విడుదలైంది. మరి నితిన్ ప్రయోగాత్మకంగా అంధుడిగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

- Advertisement -

కథ:
అరుణ్ (నితిన్) ఒక పియోనిస్ట్. అంధుడిగా నటిస్తూ తన జీవనం కొనసాగిస్తుంటాడు. అయితే అనుకోకుండా అరుణ్ ఒక మర్డర్ చూస్తాడు. అది చేసిన సిమ్రాన్ (తమన్నా) నుండి అతను ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నాడు. ఆ మర్డర్ చూడటం వల్ల అరుణ్ జీవితం ఎలా తలకిందులు అయింది? అసలు అరుణ్ ఎందుకు అంధుడిగా నటించాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మన్స్:
నితిన్ అంధుడిగా బాగా చేసాడు. ఒరిజినల్ గా చేసిన ఆయుష్మాన్  తో పోల్చలేం కానీ తనవరకూ ఔట్పుట్ ఇచ్చాడు. సినిమా అంతటా కన్సిస్టెంట్ గా కనిపిస్తూ సినిమాను ముందుకు నడిపించాడు. నభ నటేష్ ది చిన్న పాత్రే అయినా ఆమె చూడటానికి బాగుంది. గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. అయితే తమన్నా ఈ పాత్రకు సెట్ అవ్వలేదు. మరీ యంగ్ గా అనిపించింది. కొంచెం ఏజ్డ్ వాళ్ళు చేసుంటే బాగుండేదేమో. ఇక నరేష్, హర్షవర్ధన్, అనన్య, మంగ్లీ తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ఎడిటింగ్ టు ది పాయింట్ ఉంది. రన్ టైమ్ ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టాప్ లెవెల్లో ఉంది. సాంగ్స్ పర్వాలేదు. ఇక మేర్లపాక గాంధీ విషయానికొస్తే కథ, స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా మార్పులు చేయలేదు. దాదాపు ఒరిజినల్ నే ఫాలో అయిపోయాడు. మొత్తంగా ఓకే కానీ ఎమోషన్స్ ను కన్సిస్టెంట్ గా మైంటైన్ చేయలేకపోయాడు.

చివరిగా:
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అంధధూన్ కు రీమేక్ గా తెరకెక్కిన మేస్ట్రో ఒరిజినల్ తో పోల్చుకుంటే నిరాశనే కలిగిస్తుంది. అయితే హిందీ సినిమా చూడని వారికి మాత్రం ఈ సినిమా వన్ టైమ్ వాచ్ అని చెప్పవచ్చు. మేస్ట్రో కన్సిస్టెంట్ గా ఒక ఫ్లో లో వెళ్ళకపోవడం నిరాశను కలిగిస్తుంది. అయితే అంచనాలు పెద్దగా లేకపోతే ఒక్కసారి చూడవచ్చు.

రేటింగ్ : 2.75/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All