Homeటాప్ స్టోరీస్ఈ శుక్రవారం : మేస్ట్రో, గల్లీ రౌడీ

ఈ శుక్రవారం : మేస్ట్రో, గల్లీ రౌడీ

Maestro and Gully Rowdy releasing this friday
Maestro and Gully Rowdy releasing this friday

ఈ శుక్రవారం కూడా బాక్స్ ఆఫీస్ సందడి నెలకొంది. అయితే ఈసారి థియేట్రికల్ రిలీజ్ లతో పాటు ఓటిటి రిలీజ్ కూడా సందడి చేయనుంది. నితిన్ హీరోగా నటించిన మేస్ట్రో చిత్రం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవుతోంది. మేస్ట్రో నిర్మాతలు డిస్నీ + హాట్ స్టార్ తో డీల్ ను సెట్ చేసుకున్నారు. రేపటి నుండి మేస్ట్రో ఆ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది.

ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయగా నభ నటేష్ హీరోయిన్ గా నటించింది. తమన్నా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అంధధూన్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇక థియేటర్ లో సందీప్ కిషన్ హీరోగా గల్లీ రౌడీ విడుదలవుతోంది. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది.

- Advertisement -

గల్లీ రౌడీ ప్రోమోలు ఇప్పటికే ప్రామిసింగ్ గా అనిపించాయి. వీటితో పాటు ప్లాన్ బి, హనీ ట్రాప్, విజయ్ రాఘవన్ చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All