
వేమి మమతా, అయేషా తక్కి, శరత్ చంద్ర, లక్కీ దానయ్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నఘం. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు దీపావళి సందర్భంగా విడుదల చేసారు. ఆసక్తికర కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ జయకర్ డైరెక్ట్ చేసాడు. శివ దోసకాయల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి పూజ కార్యక్రమాలు సీనియర్, లెజండరీ నటులు కైకాల సత్యనారాయణ గారి ఆశీస్సులతో పూర్తి చేసారు. అలాగే ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ను మధు నందన్ విడుదల చేయడం విశేషం.

ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే చాలా ఆసక్తికరంగా సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి అనే విధంగా ఉంది. డార్క్ థీమ్ తో తయారుచేసిన ఈ ఫస్ట్ లుక్ కు విశేష రెస్పాన్స్ వస్తోంది. డెవోజు లింగాచారి ఈ చిత్రాన్ని రచించగా అరవింద్ బి సినిమాటోగ్రఫీ అందించాడు.
భగవత్ (కరుణాకర్) ఈ సినిమాకు సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. శ్రీని పుచ్చకాయల సహనిర్మాణం, కార్యనిర్వాహక నిర్మాతగా సోని సాంబ అందించిన ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే రివీల్ అవుతాయి.
