Homeటాప్ స్టోరీస్మాస్క్ పెళ్లిళ్ల‌పై మాధవీల‌త సెటైర్లు!

మాస్క్ పెళ్లిళ్ల‌పై మాధవీల‌త సెటైర్లు!

మాస్క్ పెళ్లిళ్ల‌పై మాధవీల‌త సెటైర్లు!
మాస్క్ పెళ్లిళ్ల‌పై మాధవీల‌త సెటైర్లు!

క‌రోనా కార‌ణంగా జ‌న‌జీవితం స్థంభించిపోయింది. సినిమాల షూటింగ్‌లు, రిలీజ్‌లు అగిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్ష‌న్‌లు చేయ‌డానికి ఎవ‌రూ స‌హ‌సించ‌డం లేదు. ప్ర‌భుత్వాలు కూడా పెళ్లిళ్లు, ఫంక్ష‌న్‌లు అంటే అనుమ‌తులు ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తున్నాయి. త‌క్కువ సంక్ష‌లో అతిథులు పాల్గొని కావాల్సిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటేనే అనుమ‌తులిస్తున్నారు.

దీంతో సింపుల్ గా వివాహాలు చేసుకోవాల్సి వ‌స్తోంది. దీనికి సిద్ధ‌ప‌డిన వారు సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. అలా వివాహం చేసుకోవ‌డం ఇష్టం లేని వారు మాత్రం సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప్పుఏ వివాహం చేసుకోవాల‌ని వాయిదా వేసుకుంటున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో సింపుల్‌గా జ‌రిగిన పెళ్లిళ్ల‌పై న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త సెటైర్లు వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

`అస‌లు ఆగ‌ట్లేదుగా జ‌నాలు. మాస్కులు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు?.. ముహూర్తం మ‌ళ్లీ రాదా? ఇది పోతే శ్రావ‌ణం..కాక‌పోతే మాఘ‌మాసం..లేకుంటే మ‌రో వ‌న్ ఇయ‌ర్.. పిల్ల దొర‌క‌దా.. పిల్లోడు మారిపోతాడా?.. అలా మారిపోయే మ‌య‌నుషుల‌తో పెళ్లి అవ‌స‌ర‌మా? క‌ఒన్నాళ్లు ఆగ‌లేని సంసారాలు చేస్తారా?. ఫిక్స్ అయిన మ్యారేజెస్‌లో గ్యాప్ వ‌స్తే నిజాలు తెలిసే బంప‌ర్ ఆఫ‌ర్ మిస్స‌వుతున్నారు. స‌చ్చిపోతున్నార్రా నాయ‌నా అంటే ఈ పెళ్లి ఏందో..నాకేమీ అర్థం కావ‌డం లేదు. పీపుల్ మ‌స్ట్ బీ క్రేజీ.. కాదు కాదు.. గాడ్ మ‌స్ట్ బీ క్రేజీ..` అంటూ మాస్క్ పెళ్లిళ్ల‌పై సెటైర్లు వేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All