Homeటాప్ స్టోరీస్మంచి సినిమాకు కరోనా షాక్ ఇచ్చింది

మంచి సినిమాకు కరోనా షాక్ ఇచ్చింది

మంచి సినిమాకు కరోనా షాక్ ఇచ్చింది
మంచి సినిమాకు కరోనా షాక్ ఇచ్చింది

ఒక్కోసారి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయని అనుకుంటాం కానీ చివరికి ఏదీ మన చేతుల్లో ఉండదు. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు జనజీవనం సాధారణంగా గడపలేని పరిస్థితికి చేరుకుంది. ఎలా తిరిగితే ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు స్వచ్ఛందంగా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితికి చేరుకుంది. ప్రభుత్వం కూడా ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా వారం రోజుల పాటు థియేటర్లు బంద్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే ఒక సినిమాకు శాపంగా మారింది.

గత వారం చిన్న సినిమాగా మొదలైన మధ, బాగుందని పేరు తెచుకునేలోపే కనుమరుగవుతోంది. మధ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా మధ తెరకెక్కింది. ఈ సినిమాకు మొదటి నుండి పబ్లిసిటీ పెద్దగా చేయలేదు. డైరెక్ట్ గా ట్రైలర్ ను లాంచ్ చేసి కొద్ది రోజుల్లోనే సినిమాను దింపేశారు. లిమిటెడ్ స్క్రీన్స్ లోనే ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకుందన్న వార్తతో సినిమాపై ఆసక్తి కలిగింది. లేడీ డైరెక్టర్ శ్రీ విద్య బసవ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చిత్ర యూనిట్ ను అభినందించారు. ముఖ్యంగా సాంకేతిక విభాగం పనితీరు అమోఘంగా ఉందని సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారు.

- Advertisement -

మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజుకి థియేటర్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఫ్లో ఇలాగే కొనసాగితే మధ మంచి విజయం సాధిస్తుంది అని అందరూ అనుకునేలోపే థియేటర్లను వారం పాటు తెలంగాణలో మూసివేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది అంటున్నారు. వారం తర్వాత థియేటర్లు తెరిచినా అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ సినిమాను అందరూ మర్చిపోతారు. పెద్ద సినిమాలు విడుదలకు క్యూ కట్టేస్తాయి. సో ఈ చిత్రం దాదాపుగా ఫుల్ రన్ కు చేరుకున్నట్లే. మొత్తానికి ఒక మంచి సినిమా దురదృష్టకర కారణాల రీత్యా ప్లాప్ గా మిగలనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All