
వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న నితిన్ ..ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అంటూ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో నితిన్ సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా ఆయన వెనకాల పులి గెటప్‌లతో విలన్లు తన మీద కత్తి దూయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పోస్టర్‌ను గమనిస్తూ ఎదో ఫైటింగ్ సన్నివేశంలా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నితిన్ తన సోషల్ మీడియాలో ‘మీకు నచ్చే, మీరు మెచ్చే, మాస్‌తో వస్తున్నా రిపోర్టింగ్ సిద్ధార్థ్ రెడ్డి’ అంటూ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్.. ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందిస్తున్నారు.