Homeటాప్ స్టోరీస్శ్రీరెడ్డి విషయంలో పరువు తీసుకున్న మా

శ్రీరెడ్డి విషయంలో పరువు తీసుకున్న మా

Maa  u turn on srireddy issueమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి విషయంలో అతిగా స్పందించి పరువు తీసుకుంది. శ్రీరెడ్డి కి మాలో సభ్యత్వం ఇవ్వమని అలాగే ఆమెతో కలిసి నటిస్తే వాళ్ళ సభ్యత్వం కూడా రద్దు చేస్తామని శ్రీరెడ్డి వివాదాన్ని మరింత రాజేసి అందరి ముందు పరువు తీసుకుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. శ్రీరెడ్డి పై ఆంక్షలు విధిస్తే గొడవ సద్దుమనుగుతుందని భావించారు కానీ అది మరింతగా ముదిరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మా పరువు పోయింది అంతేకాదు శివాజీ రాజా పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

శ్రీరెడ్డి లీక్స్ తెలుగు సినిమా రంగాన్ని కుదిపేస్తుండటంతో రంగంలోకి దిగిన సినీ ప్రముఖులు శివాజీరాజా ని తలంటడంతో హుటాహుటిన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరెడ్డి పై ఎలాంటి బ్యాన్ విధించడం లేదని అలాగే ఆమెని మా సగర్వంగా ఆహ్వానిస్తోందని ……అంతేకాదు శ్రీరెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో క్వాష్ కమిటీ వేస్తున్నామని తెలిపారు. ఇంత సడెన్ గా మా యు టర్న్ తీసుకోవడంతో మా అసోసియేషన్ పరువు పోయింది అలాగే అధ్యక్షుడు గా శివాజీరాజా విఫలమవడమే కాకుండా మాకు మాయని మచ్చ అయ్యేలా చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All