Homeటాప్ స్టోరీస్మా ఎన్నికలు: వైసీపీ వెర్సస్ జనసేన?!

మా ఎన్నికలు: వైసీపీ వెర్సస్ జనసేన?!

మా ఎన్నికలు: వైసీపీ వెర్సస్ జనసేన?!
మా ఎన్నికలు: వైసీపీ వెర్సస్ జనసేన?!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దాదాపుగా ఒక 940 మంది ఉండే ఒక ప్రైవేట్ బాడీ. ఎవరో చెప్పినట్లు కనీసం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వార్డ్ తీసుకున్నా కూడా దీనికంటే ఎక్కువ మందే ఓటర్లు ఉంటారు. అయితే ‘మా’ ఎన్నికలు మాత్రం ఏ సాధారణ రాజకీయ ఎన్నికల కంటే ఎక్కువ హడావిడిగా జరుగుతున్నాయి. గతంలో ఏకగ్రీవంగా నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకుని మా ప్రెసిడెంట్ ను ఎన్నుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఇది రాజకీయ రంగు పులుముకుంది. గతంలో నరేష్ ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు జరిగిన గొడవ మనం చూసాం.

కానీ ఈసారి ఈ రాజకీయ రంగు మరింత ఎక్కువ అయింది. ఈసారి మా అసోసియేషన్ ఎన్నికలు చాలా హడావిడిగా జరుగుతున్నాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ప్యానెల్స్ పోరు కాస్తా ఒక రాజకీయ యుద్ధాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా మంచు విష్ణుకు వైఎస్ జగన్, వైఎసార్సీపీ సపోర్ట్ ఫుల్ గా ఉండటం, ప్రకాష్ రాజ్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుండడంతో ఇది మంచు విష్ణు వెర్సస్ ప్రకాష్ రాజ్ లా కాకుండా జనసేన వెర్సెస్ వైసీపీగా మారింది.

- Advertisement -

మా అసోసియేషన్ ఎన్నికలను ఇరు వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి అక్టోబర్ 10న జరిగే ఈ ఎలక్షన్స్ లో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All